కర్నూలు ప్రభుత్వ గృహాల్లో అధికారులు సోదాలు
కర్నూలు నగరంలోని ప్రభుత్వ గృహాలను అధికారులు తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీ చేశారు. 274 ఇళ్లల్లో ప్రైవేట్ వ్యక్తులు నివాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కర్నూలు నగరంలోని ప్రభుత్వ గృహాలను అధికారులు తనిఖీ చేశారు. నగరంలోని ఏ.బీ.సీ క్యాంప్ ల్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన గృహాల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా నివసిస్తుండం జిల్లా కలెక్టర్ దృష్టకి వచ్చింది. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు రహదారులు, భవనాలు, నగరపాలక సంస్థ, పోలీసు, ట్రాన్స్ కో అధికారులు తనిఖీ చేశారు. మొత్తం 970 గృహాలు ఉండగా అందులో 274 ఇళ్ల్లల్లో ప్రైవేట్ వ్యవక్తులు ఉంటున్నట్లు గుర్తించారు. ఎలాంటి అద్దె చెల్లించకుండా నివాసం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 7రోజులు గడువు ఇచ్చి ఇళ్లు ఖాళీ చెయ్యాలని ఆదేశించారు.