కర్నూలు జిల్లాలోని నంద్యాలలో విలేకరి కేశవ్ హత్య ఘటనపై సమగ్ర దర్యాప్తుకు డీజీపీ గౌతంసవాంగ్ ఆదేశించారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీని ఆదేశించారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యూట్యూబ్ ఛానల్ విలేకరి కేశవ్ హత్యపై నంద్యాల రెండో పట్టణ పీఎస్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఘటనలో సస్పెండైన కానిస్టేబుల్, ఆయన తమ్ముడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
విలేకరి కేశవ్ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ ఆదేశం - నంద్యాల వార్తలు
నంద్యాలలో యూట్యూబ్ ఛానల్ విలేకరి కేశవ్ హత్య ఘటనపై దర్యాప్తుకు డీజీపీ ఆదేశించారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు.
డీజీపీ గౌతంసవాంగ్
నంద్యాల ఎన్జీవో కాలనీలో కేశవ్ అనే వ్యక్తి నిన్న దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి వీపుపై రక్త గాయాలు ఉన్నాయి. మృతుడు కేశవ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు విలేకరిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సుబ్బయ్య అనే వ్యక్తి తో పాటు, మరో వ్యక్తి కలిసి కేశవ్‌ను ఓ హోటల్ వద్దకు రమ్మని పిలిచారు. అక్కడకు వెళ్లిన వెంటనే కేశవని స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దుండగులు హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షి ప్రతాప్ అనే వ్యక్తి తెలిపారు. సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి