అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపి సోదా చేయగా ఇరవై ఒక్క పెట్టెల తెలంగాణ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. వీటి విలువ రెండు లక్షల యాభై వేలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు.
తనిఖీల్లో పట్టుబడిన తెలంగాణ మద్యం - illegal liquor seized by police
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ మద్యం సరఫరా ఆగడం లేదు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనపరచుకున్నారు.
పోలీసులు స్వాధీనపరచుకున్న మద్యం సీసాలు
ఈ ఘటనకు సంబంధించి దొర్నిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లికి చెందిన ఇద్దరు, డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును, ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మద్యం సీసాలో పురుగు.. వినియోగదారుడు అవాక్కు