కర్నూలు జిల్లా మద్దికెర మండలం పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఫ్లెక్సీ బోర్డు తీసేయటంతో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. అగ్రహారంలో పంచాయతీ కార్యదర్శి భోఖరియా సిబ్బందితో ఫ్లెక్సీ బోర్డు తొలగించారు. తెదేపా మండల కన్వీనర్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఫ్లెక్సీ ఉంచేలా చర్యలు చేపట్టకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
పంచాయతీ కార్యాలయం ఎదుట తెదేపా శ్రేణుల నిరసన - kurnool dst tdp news
కర్నూలు జిల్లా మద్దికెర మండలం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట తేదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఫ్లెక్సీ బోర్డు ఎలాంటి సమాచారం లేకుండా పంచాయతీ కార్యదర్శి తొలగించటంతో నాయకులు నిరసనకు దిగారు.
tdp members protest in kurnool dst madikera mandal