ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పన్నుల బాదుడు తప్ప... ప్రజల బాగు లేదు' - ALLAGADDA LATEST NEWS

ప్రభుత్వం రేషన్ కార్డులు తొలగిస్తూ.... ప్రజలపై అదనపు పన్నుల భారం మోపుతూ పాలన కొనసాగిస్తుందని ఆళ్లగడ్డలో తెదేపా ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలన్న ఆలోచన సర్కార్​కు లేదని విమర్శించారు.

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం
ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం

By

Published : Dec 10, 2020, 10:11 PM IST

వైకాపా ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలన్న తపన ఏ కోశాన కనిపించడం లేదని తెదేపా ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ విమర్శించారు. రేషన్ కార్డులను తొలగిస్తూ అదనపు పన్నుల భారం ప్రజలపై మోపుతూ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలలో తుపాను కారణంగా పంట నష్టం జరిగిందన్నారు. రైతన్నలను ఆదుకునే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఇంతవరకు లేకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే పంటనష్టంపై అసెంబ్లీలో మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. వారిని గెలిపించి ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ప్రమాదం...ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details