తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను నిరసిస్తూ.. కార్యకర్తలు నిరసన తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభలో మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఆందోళనలు రాష్ట్రమంతా ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
'సస్పెన్షన్' ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన: తెదేపా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కర్నూలులో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
తెదేపా కార్యాకర్తల ఆందోళన
TAGGED:
kurnool