కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు చేనేత పరిశ్రమను ఆదుకోవాలని ఒక రోజు మౌన దీక్ష చేశారు. చేనేతలు కరోనాతో రెండు నెలలుగా పనులు లేక దుర్భర జీవనం అనుభవిస్తున్నారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, చేనేత నాయకులు మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ప్రతి కుటుంబానికి 15వేలు ఆర్థిక సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.
చేనేత పరిశ్రమలను ఆదుకోవాలని తెదేపా దీక్ష
చేనేత కళాకారులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలో తెదేపా నాయకులు ఒకరోజు దీక్ష చేపట్టారు. చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ప్రతి కుటుంబానికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.
tdp