తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. పోలవరం పూర్తి చేయలేనప్పుడు ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మద్యం విషయంలో ఆలస్యంగా మేల్కొన్నారన్నారు. విజయసాయిరెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి.. నిర్వహించాలని సవాలు విసిరారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి కావాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
పోలవరం పూర్తి చేయలేకపోతే రాజీనామా చేయండి: సోమిశెట్టి
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతే సీఎం జగన్ రాజీనామా చేయాలని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి.. నిర్వహించాలని సవాలు విసిరారు.
tdp comments