కర్నూల్ జిల్లా నంద్యాలలో యూట్యూబ్ ఛానెల్ విలేకరి హత్య కేసులో కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య(సస్పెండెడ్)తో పాటు అతని సోదరుడు నానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు.
నంద్యాల ఎన్జీవో కాలనీలో కేశవ్ అనే వ్యక్తి నిన్న దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి వీపుపై రక్త గాయాలు ఉన్నాయి. మృతుడు కేశవ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు విలేకరిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటసుబ్బయ్య అనే కానిస్టేబుల్ పాటు, మరో వ్యక్తి కలిసి కేశవ్‌ను ఓ హోటల్ వద్దకు రమ్మని పిలిచారు. అక్కడకు వెళ్లిన వెంటనే కేశవని స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.