కర్నూలు పాతబస్తీలోని సున్నం వీధికి చెందిన సుబ్రమణ్యం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లల పాఠశాల ఫీజు చెల్లించే విషయంలో భార్యభర్తలు గొడవపడ్డారు. మనస్థాపం చెందిన సుబ్రమణ్యం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి సబ్రమణ్యం ప్రాణాలు కోల్పోయాడు.. మృతుడికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్షణికావేశంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - suicide
క్షణికావేశంతో కర్నూలులో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ తగాదాలే కారణమని స్థానికులు అంటున్నారు.
ఆత్మహత్య