కర్నూలు జిల్లా కోడుమూరులో ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. తమ పాఠశాలలో మంచినీళ్ల వసతి కల్పించాలంటూ.. మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వారికి ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు అండగా నిలిచారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఎంపీడీవో కార్యాలయానికి విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో నీళ్ల కోసం విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారంటూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీ రాములు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో శౌచాలయాలు ఉన్నా.. నీటి సౌకర్యం లేక బాలికలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో మంజులవాణికి సమర్పించారు. ఎంపీడీవో, ఎంఇఓతో నీటి సౌకర్యంపై ఆరా తీశారు. పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
మంచినీటి కోసం.. రోడ్డెక్కిన విద్యార్థులు - rally
కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ధర్నా చేశారు. నీటి కోసం తీవ్ర అవస్థులు పడుతున్నామని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ఉన్నత పాఠశాలలో నీటి కోసం విద్యార్థుల ధర్నా