ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DEATH: బీటెక్ విద్యార్థి మృతి.. ఫీజు వేధింపులే కారణమా..? - btech student death

కర్నూలు జిల్లాలో సుంకేసుల జలాశయాన్ని చూసేందుకు వెళ్లిన బీటెక్​ విద్యార్థి నదిలో పడి మృతి చెందాడు. ఇది ప్రమాదం కాదని ఫీజు చెల్లించక పోవడంతో పరీక్షలకు అనుమతించలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

బీటెక్ విద్యార్థి మృతి
బీటెక్ విద్యార్థి మృతి

By

Published : Aug 19, 2021, 9:17 PM IST


కర్నూలు జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకేసుల జలాశయం వద్ద తుంగభద్ర నదిని చూడడానికి మిత్రులతో కలిసి వెళ్లిన బీటెక్ విద్యార్థి ప్రమాదవశాత్తు తుంగభద్ర నదిలో పడి మృతి చెందాడు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలానికి చెందిన షేక్ ఆఫ్తాబ్ (20) బీటెక్ సెకండ్ ఇయర్ చదుతున్నాడు.

ప్రమాదవశాత్తు నదిలో పడినట్లు భావిస్తున్న పోలీసులు..

కర్నూలులోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న షేక్ ఆఫ్తాబ్ తోటి మిత్రులైన ప్రభాకర్, రవీంద్రగౌడ్ తో కలిసి సుంకేసుల జలాశయం చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పుష్కర ఘాట్ వద్ద సేదతీరుతూ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన షేక్ ఆఫ్తాబ్ ఒక్కసారిగా నదిలోకి జారిపోయి మృతి చెందాడు. తోటి మిత్రులు కేకలు వేయగా అక్కడే ఉన్న జాలర్లు హుటాహుటిన వచ్చినప్పటికీ కాపాడలేకపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫీజుల భారం తోనే మృతి చెందాడా..?

జలాశయాన్ని చూసేందుకు వెళ్లిన మృతుడు షేక్ అఫ్తాబ్ కు ఇవాళ్టి నుంచి పరీక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫీజు చెల్లించక పోవడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వలేదని, ఫీజుల భారంతోనే మనస్థాపానికి గురై మృతి చెందాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇదీ చదవండి:ఇదేం పద్ధతి.. సొంత పనులకు ఇంటింటికి రేషన్ వాహనం...!

ABOUT THE AUTHOR

...view details