కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నందున... లాక్ డౌన్‌ను పోలీసులు మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం అనవసరంగా బయటకు వచ్చినవారి 40 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. వారందరితో మాస్కులు ధరింపజేసి... ద్విచక్రవాహనాలతో సహా నగరంలోని ఉల్చాల రోడ్డు నుంచి కొత్త బస్టాండ్ వరకు నడిపించారు. అక్కడ ఆ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా బయటకు వచ్చేవారికి కనువిప్పు కలగాలని ఇలా చేసినట్టు కర్నూలు డీఎస్పీ తెలిపారు.
నిర్లక్ష్యం వహిస్తే.. నడవాల్సిందే!
కర్నూలులో కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకి వచ్చేవారి వాహనాలను స్వాధీనం చేసుకొని.. సీజ్ చేస్తున్నారు.
strictly follow the corona lockdown in Kurnool