పాయసం అలా తింటే వర్షాలు కురుస్తాయట! - undefined
వర్షం కోసం వివిధ ప్రాంతాల్లో వివిధ పూజలు చేస్తారు. కానీ కర్నూలు జిల్లా అహోబిల క్షేత్ర పరిధిలో ఉన్న గిరిజనులు మాత్రం వింత ఆచారాన్ని పాటించడం ఆనవాయితీ. మరి ఆ వింతేమంటే...
కర్నూలు జిల్లా లక్ష్మీనరసింహస్వామి వెలమిన అహోబిల క్షేత్ర పరిధిలో ఒక గిరిజన తెగ నివసిస్తుంది. అక్కడ వారి ఆచారాలు చాలా వింతగా ఉంటాయి. వర్షాలు సరిగ్గా కురవటం కోసం వారు వింతైన ఆచారాన్ని పాటిస్తారు. గ్రామస్తులంతా కలసి పాయసాన్ని వండి కొండపై వెలసిన గుడ్డి సింగరయ్య స్వామి గుడికి కోలాహలంగా తరలివెళ్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొండ రాళ్లపై పాయసాన్ని పోసి గోవింద నామ స్మరణ చేస్తూ నాలుకతో స్వీకరిస్తారు. ఇలా చేస్తే తప్పక వర్షం కురుస్తుందని వారి నమ్మకం. ఒక్కో చోట ఒక్కో నమ్మకం!
TAGGED:
strange ritvuals in kurnool