కర్నూలు జిల్లా నంద్యాలలో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. పలు జిల్లాలకు చెందిన జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎంపీ వారిని అభినందించారు.
ఈ కార్యక్రమానికి నంద్యాల క్రికెట్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్పందన అంధుల సంక్షేమ సంఘం సభ్యులు హాజరయ్యారు.