ఆదివారం సూర్యగ్రహణం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లన్న ఆలయాన్ని శనివారం రాత్రి 10 గంటలకు మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అ తర్వాత మంగళహారతులు , కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం నుంచి భక్తులకు యథావిధిగా దర్శనలు కల్పించనున్నారు.
సూర్యగ్రహణం ఎఫెక్ట్: శ్రీశైలం, మహానంది ఆలయాల మూసివేత - mahanandhi latest news
ఆదివారం సూర్యగ్రహణం కారణంగా శనివారం రాత్రి శ్రీశైలం మల్లన్న, మహానంది ఆలయాలను మూసివేయనున్నారు.
సూర్యగ్రహణం కారణంగా అలయాల మూసివేత
మహానందిలోనూ...
సూర్యగ్రహణం కారణంగా కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద శైవక్షేత్రం మహానంది ఆలయాన్ని ఆదివారం మూసివేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు మూసివేసి ఆ తర్వాత సంప్రోక్షణ చేసి అలయాన్ని తెరుస్తారు.