శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద - srisailam water flow
శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 2,22,407 క్యూసెక్కుల చేరింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు ఉండగా..ప్రస్తుత నీటిమట్టం 879 అడుగలకు చేరింది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల నుంచి దిగువకు73, 267 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద పోటెత్తుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 2 లక్షల 22 వేల 407 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా..... ప్రస్తుత నీటిమట్టం 879 అడుగలకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం దాదాపు 188 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. మరోవైపు దిగువనున్న జలాశయాలకు శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2 వేల 400 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2 వేల 26 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 24వేల 500 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల నుంచి నాగార్జునసాగర్‌కు... 73 వేల 267 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
TAGGED:
srisailam water flow