శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో... జలాశయం అన్ని గేట్లు మూసివేశారు. జలాశయంలో 2 లక్షల 3వేల 560 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. వివిధ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు... లక్షా 10వేల 760 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం జలాశయంలో 884.30 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 211.47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42వేల 378, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 29వేల 956, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2వేల 400, హంద్రీనీవాకు 2వేల 26, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 34వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంలో స్థిరంగా వరద ప్రవాహం - telangana
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జలాశయం అన్ని స్పిల్వే గేట్లు మూసివేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు... లక్షా 10వేల 760 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నాయి.
srisailam-water-flow