ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలానికి పెరుగుతున్న వరద నీరు - water

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వరద భారీగా చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పెరిగింది.

srisailam-water-flow

By

Published : Aug 8, 2019, 8:49 AM IST

Updated : Aug 8, 2019, 5:16 PM IST

శ్రీశైలానికి భారీ వరద

శ్రీశైలం జలాశయానికి 3 లక్షల 23 వేల 983 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.30 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 169.86 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 42 వేల 378 క్యూసెక్కులు.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32 వేల 145 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1013 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటరీ ద్వారా 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్​కు 735 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరగవచ్చన్న వార్తలతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

Last Updated : Aug 8, 2019, 5:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details