శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 10వ తేదీ నుంచి దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా గత రెండున్నర నెలలుగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. ప్రభుత్వం లాక్డౌన్లో సడలింపులు ఇచ్చినందున మళ్లీ దేవాలయాలు పునఃదర్శనానికి సిద్ధమవుతున్నాయి. ఈనెల 10 నుంచి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు ప్రారంభం కానున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.
ఈనెల 10 నుంచి శ్రీశైలంలో భక్తులకు దర్శనం
లాక్డౌన్ కారణంగా గత నెలన్నరగా ఆలయాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. తాజాగా ఇచ్చిన సడలింపులతో గుళ్లు పునఃదర్శనాలకు సిద్ధమవుతున్నాయి. శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 10 నుంచి శ్రీశైల దర్శనం
క్షేత్ర పరిధిలోని ఫుడ్ కోర్టు ప్రాంగణంలో స్థానిక సంఘాలతో ఈవో సమావేశమై చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. 8,9 తేదీల్లో దేవస్థానం ఉద్యోగులు, స్థానికులతో దర్శనాలకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 3 వేల మంది భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చేవారు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇవీ చదవండి.. దేవర ఎద్దుకు అంత్యక్రియలు