ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్తాబవుతున్న శ్రీశైలం మల్లన్న ఆలయం

కేంద్ర ప్రభుత్వం జూన్ 8వ తేదీ నుంచి దేవాలయాలు తెరిచేందుకు అనుకులంగా ఆంక్షలు సడలించింది. కర్నూలు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సిబ్బంది.. ఆలయాన్ని తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

srisailam temple arrengements at karnool
శ్రీశైల మల్లన్న ఆలయం

By

Published : May 31, 2020, 10:35 PM IST

కర్నూలు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం త్వరలో తెరుచుకోనుంది. భక్తుల దర్శనార్థం.. కరోనా కట్టడి నిబంధనలతో ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల వల్ల జూన్ 8వ తేదీ నుంచి మల్లన్న దర్శించుకునే భాగ్యం భక్తులకు కలగబోతోంది. భౌతిక దూరం పాటించేందుకు ఆలయ క్యూలైన్ల వద్ద వృత్తాలను పెయింట్​తో గీశారు. గంటకు 300 మంది భక్తుల చొప్పున దర్శనానికి అనుమతించనున్నారు.

టైం స్లాట్ విధానంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాస్కు ధరించేలా చర్యలు చేపట్టారు. చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్​లను దేవస్థానం అందుబాటులో ఉంచనుంది. రోజుకు కనీసం 3వేల మంది భక్తులను... దర్శనానికి అనుమతించాలని యోచిస్తున్నారు.

భక్తులు దర్శనాలకు ప్రవేశించే క్యూలైన్ల వద్ద క్రిమిసంహారక ద్వారాలను ఏర్పాటు చేయబోతున్నారు. దేవాదాయ శాఖ నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే దర్శనాలు అనుమతించనున్నారు. ముందస్తుగా దేవస్థానం ఉద్యోగులతో దర్శనాల ట్రైయల్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

శ్రీశైలానికి మంత్రి అనిల్​కుమార్

ABOUT THE AUTHOR

...view details