ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కనిష్ఠ స్థాయికి శ్రీశైలం నీటిమట్టం

By

Published : May 25, 2020, 6:43 AM IST

శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుతుండటంతో... విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది.

srisailam water level
శ్రీశైలం నీటిమట్టం

శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. ఆదివారం జలాశయం నీటిమట్టం 811.90 అడుగులు, నీటి నిల్వ 35.4269 టీఎంసీలకు చేరింది. జలాశయంలో నీరు 28 టీఎంసీలకు చేరుకోగానే డెల్టా స్టోరేజీగా పరిగణిస్తారు. ఈ ప్రకారం ఇంకా 7 టీఎంసీల నీరు విద్యుదుత్పత్తి, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. జూన్‌లో ప్రారంభం కానున్న వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల జలాశయాలకు ఆశించిన విధంగా నీరు వస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details