ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద భారీగా చేరుతోంది. ప్రస్తుతం జలాశయం 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి 5,65,040 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు.

By

Published : Sep 27, 2020, 10:11 PM IST

Published : Sep 27, 2020, 10:11 PM IST

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. సుంకేసుల నుంచి 5,10,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేశారు. ఫలితంగా.. శ్రీశైలం జలాశయం 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి 5,65,040 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884 అడుగులు ఉండగా..,నీటి నిల్వ సామర్థ్యం 210 టీఎంసీలుగా నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details