ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ బాధితుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి - kurnool district latest news

కర్నూలు జిల్లాలో కరోనా బాధితుల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొవిడ్ బారిన పడ్డాక పూర్తిగా కోలుకునే వరకూ వారిని హోం ఐసోలేషన్‌ టీం పర్యవేక్షిస్తోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి, వసతుల్ని బట్టి ఎక్కడ చికిత్స తీసుకోవాలో సూచిస్తున్నారు. రోగులకు ఫోన్‌ చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. వారికి అందాల్సిన మందుల కిట్లు, ఇతర సౌకర్యాలపైనిత్యం ఆరా తీస్తున్నారు.

special-focus-on-corona-victims-in-kurnool-district
కర్నూలు జిల్లాలో కరోనా బాధితుల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి

By

Published : May 21, 2021, 9:25 AM IST

కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి కలవరపెడుతోంది. ఈ స్థితిలో బాధితులను ఆదుకునేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో హోం ఐసోలేషన్‌ టీంను ఏర్పాటుచేశారు. వీరు అక్కడి నుంచే రోగులతో మాట్లాడుతూ వారి పరిస్థితిని తెలుసుకుని సూచనలు చేసేలా ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సమాచారం ముందుగా కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లోని హోం ఐసోలేషన్‌ బృందానికి చేరుతుంది. ఏ ఊళ్లో ఎవరికి కరోనా ఉందో తెలుసుకుని బృందం సభ్యులు వెంటనే వారికి ఫోన్‌ చేస్తారు. వారి ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటారు. వ్యాధి లక్షణాలు లేని వారికి ఇంట్లో వసతులు ఉంటే హోం ఐసోలేషన్‌లోనే ఉండమని సూచిస్తారు. సౌకర్యాలు లేకపోతే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచిస్తారు. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు, కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రి చేరాల్సిందిగా సూచిస్తారు. బాధితుల వివరాల్ని మండలంలోని ప్రభుత్వ వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు చేరవేస్తారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మెడికల్‌ కిట్‌ అందిందా? ఆక్సిజన్‌, బీపీ, షుగర్‌ స్థాయిలి ఎలా ఉన్నాయా? ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంబంధిత యాప్‌లలో నిక్షిప్తం చేస్తారు.

జిల్లాను 4 డివిజన్లుగా అధికారులు విభజించారు. ఒక్కో డివిజన్‌ను ఒక్కో బృందం పర్యవేక్షిస్తుంది. ఒక్కో టీంలో ఓ వైద్యుడు, ఇద్దరు సూపర్‌వైజర్లు, నలుగురు నర్సింగ్ విద్యార్థులు ఉంటారు. వీరు ఆ ప్రాంతంలోని రోగులకు, స్థానిక వైద్యులు, ఏఎన్‌ఎంలకు అనుసంధానకర్తలుగా ఉంటారు. రోజూ సుమారు 2 వేల మందిని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తామని సిబ్బంది చెబుతున్నారు. కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎక్కువ మంది బాధితులు కోలుకునేలా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

కర్నూలు జిల్లాలో కరోనా బాధితుల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి

ఇవీచదవండి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టులో తీర్పు

తమిళనాడులో తగ్గని కరోనా ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details