ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా భర్తకు ఏదైనా జరిగితే ఎస్పీదే బాధ్యత -అఖిలప్రియ - sp phakeerappa

కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. తన భర్తకు ఏదైనా జరిగితే ఎస్పీనే బాధ్యత వహించాలన్నారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నా భర్తకు ఏదైనా జరిగితే ఎస్పీదే బాధ్యత -అఖిలప్రియ

By

Published : Oct 22, 2019, 9:26 PM IST

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్లే తమ కుటుంబంపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. ప్రజాసమస్యలపై మాట్లాడినందుకు తమ గొంతునొక్కుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలతో గవర్నర్‌ను కలుస్తానని అన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే... ఎస్పీనే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details