ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడి కర్కశత్వం.. కన్నతల్లిపై రోకలి బండతో దాడి - నంద్యాలలో తల్లిపై కుమారుడి దాడి వార్తలు

కన్నతల్లిపై కర్కశత్వం చూపించాడు ఓ కుమారుడు. జన్మనిచ్చిన తల్లిని రోకలిబండతో తలపై కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది.

son attack on mother in nandyala kurnool district
కుమారుడి దాడిలో గాయపడిన తల్లి

By

Published : Aug 30, 2020, 12:36 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో తల్లిపై కుమారుడు దాడి చేశాడు. పట్టణంలోని రాయల్ కాంపౌండ్​కు చెందిన చాకలి అంజనమ్మను.. ఆమె కుమారుడు రాముడు రోకలి బండతో తలపై కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details