ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల జీవితాల్లో చీకట్లు... పరిహారం కోసం పాట్లు

సోలార్‌ పార్క్‌తో జీవితం కాంతివంతమవుతుందనుకున్నారు. ఇంటికో ఉద్యోగం... చేతినిండా పరిహారం లభిస్తుందని ఆశపడ్డారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క హామీనీ నెరవేర్చలేదు. సహనం చచ్చి రైతులు నిలదీస్తే.. వారిపైనే కేసులు పెట్టారు.

By

Published : Jul 26, 2019, 1:01 PM IST

రైతుల జీవితాల్లో సౌర చీకట్లు... పరిహారం కోసం పాట్లు...

రైతుల జీవితాల్లో సౌర చీకట్లు... పరిహారం కోసం పాట్లు...

కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లోని శకునాల, గని గ్రామాల్లో ప్రభుత్వం 5 వేల 2 వందల ఎకరాల భూములు సేకరించి సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసింది. 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో... వెయ్యి మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యంతో... 2017లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ భూములకు ఎకరానికి 4.20 లక్షల రూపాయల ప్రకారం ధర నిర్ణయించి కొందరు రైతులకు పరిహారం చెల్లించారు. ఇంకొందరికి ఇప్పటివరకూ పరిహారం అందలేదు. దీనిపై బాధిత రైతులు న్యాయపోరాటం చేస్తున్నారు.

సౌర విద్యుత్తు కేంద్రంలో భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం కల్పించేందుకు ఏడాది క్రితం 81 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. గనిలో 10 కోట్లు, శకునాలలో 10 కోట్లు పంపిణీ చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం పొందాల్సిన వారంతా ఆందోళనబాట పట్టారు. దీనితో వీరిపై కేసులు నమోదు చేశారు. భూములు కోల్పోవటమే కాకుండా.. కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

ఇదిలావుంటే.. రైతులపై కేసులు నమోదు కావటం వల్లే నష్టపరిహారం ఆలస్యమవుతుందంటున్నారు అధికారులు. ఈ భూములనే నమ్ముకొని జీవిస్తున్న తమపై.. అక్రమ కేసులు కొట్టేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చదవండి..

ఆ పరిశ్రమ... అక్కడి ప్రజలను భయపెడుతోంది!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details