ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడూరులో బైకులో దూరిన పాము.. తిరుమల మెట్ల బాటలో భయపెట్టిన కొండచిలువ - tirumala latest news

కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో ద్విచక్ర వాహనంలో పాము కలకలం రేపింది. పామును బయటకు రప్పించేందుకు స్థానికులు నానా ప్రయత్నాలు చేశారు. చివరికి పెట్రోల్ ట్యాంక్.. ఇతర భాగాలను విడదీసి పామును బయటికి తీయాల్సి వచ్చింది.

snake
snake

By

Published : Jul 15, 2021, 5:06 PM IST

బైక్​లో పాము కలకలం

కర్నూలు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనంలో దూరిన పాము కలకలం రేపింది. ఆ సర్పాన్ని బయటకు రప్పించేందుకు బైకు యజమాని తంటాలు పడ్డారు. వాహనం పెట్రోల్ ట్యాంక్, తదితర భాగాలను ఊడదీయాల్సి వచ్చింది. ఓ వ్యక్తి పాము తోక పట్టుకుని బయటకు లాగగా.. సగభాగం తెగిపోయింది. ఆ తర్వాత బైకులోపల మిగిలిన భాగాన్నీ బయటకు లాగి కర్రలతో కొట్టి చంపేశారు.

తిరుమలలో కొండచిలువ హల్​చల్..

తిరుమలలో కొండ చిలువ హల్ చల్

తిరుమల మెట్ల మార్గంలో కొండచిలువ హల్‌చల్‌ చేసింది. ఏడో మైలు వద్ద బుసలు కొడుతూ భక్తుల కంటపడింది. పట్టుకునేందుకు ప్రయత్నించగా తిరగబడింది. దుకాణం వద్దనున్న టేబుల్‌ను కరుచుకుంది. చాలా సేపటి తర్వాత కొండచిలువను పట్టుకుని..అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

ఇదీ చదవండి:

rains: భారీ వర్షాలు.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

ABOUT THE AUTHOR

...view details