చిన్నారి క్షేమానికి పోలియో చుక్క - venkatesg tg
రాష్ట్ర వ్యాపంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా అధికారులు పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
ప్రతి ఒక్కరు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి ఏపీని పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. అమరావతి సచివాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు సంవత్సరాలు లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని కోరారు.మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ నెల 13న విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేస్తామని వివరించారు. బూత్ స్ధాయి నుంచి ఇంటింటికి వెళ్లి ఎఎన్ఎమ్, ఆరోగ్య కార్యకర్తలు, టీచర్స్ , అంగన్ వాడీ వర్కర్స్, ఆశా కార్యకర్తలు పోలియో చుక్కలు వేస్తున్నట్లు మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు.
దేశం నుంచి తరిమికొడదాం
పోలియో వ్యాధిని దేశం నుంచి తరమివేశామని అదే విధంగా క్యాన్సర్ వ్యాధిని కూడా వెళ్లగొట్టే విధంగా మందులు కనిపెడితే బాగుంటుందని ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు.