కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చెరువు గ్రామానికి చెందిన 30 గొర్రెలు మృతి చెందాయి. చిన్న మల్కాపురం గ్రామంలో ఉన్న జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో కలుషిత నీరు తాగటం వలనే గొర్రెలు మృతి చెందాయని గొర్రెల కాపరులు తెలిపారు. గొర్రెకాపరులు మాణిక్యం, లక్ష్మన్నకు చెందిన 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని గొర్రెలకు పశువైద్యులు వైద్యం అందిస్తున్నారు. గొర్రెల మృతితో తమకు రూ.2 లక్షల 28 వేలు నష్టం వాటిల్లిందని కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల పెంపకంపై ఆధారపడే తమకు ఈ ఘటనతో నష్టం కలిగిందని తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
కొచ్చెరువులో కలుషిత నీరు తాగి 30 గొర్రెలు మృతి - గొర్రెలు మృతి
కర్నూలు జిల్లా కొచ్చెరువు గ్రామంలో 30 గొర్రెలు మృతి చెందాయి. గ్రామ సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలోని కలుషిత నీరు తాగడం వలనే గొర్రెలు మృత్యువాత పడ్డాయని కాపరులు తెలిపారు. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవించే తమకు ఈ ఘటనతో తీవ్ర నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి చేశారు.
కలుషిత నీరు తాగి 30 గొర్రెలు మృతి