ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టును ఢీకొన్న కారు... ఏడుగురికి గాయాలు - Kurnool road accident news

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో జరిగింది.

Seven people were injured in road accident
కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలు

By

Published : Mar 13, 2021, 3:19 PM IST

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం భీమునిపాడు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొనడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అవుకు మండలంలోని చెన్నంపల్లెకు చెందిన బైరెడ్డి కేశవరెడ్డి, కృష్ణాంజలి, రవికుమార్, లక్ష్మీరెడ్డి, నాగలక్ష్మమ్మ, మద్దిలేటిరెడ్డి, చెన్నకేశవరెడ్డిలు శివరాత్రి సందర్భంగా కడప జిల్లాలోని పొంతల గ్రామంలో వెలసిన అక్కదేవతలను దర్శించుకొని కారులో స్వగ్రామానికి బయలుదేరారు.

కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకాగా...వాహనంలో ఉన్నవారంతా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details