కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఎగువ నుంచి వచ్చే భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది. ఆలయ పూజారి రఘురామశర్మ శిఖర పూజలు నిర్వహించారు. మరో వైపు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 3,15,576 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 854.80 అడుగులకు చేరింది.
నీట మునిగిన సంగమేశ్వర ఆలయం.. ఆలయ పూజారి శిఖర పూజలు
కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం ఆలయం కృష్ణమ్మ ఒడికి చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద శ్రీశైలం జలాశయంలోకి చేరడంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది.
నీట మునిగిన సంగమేశ్వర ఆలయం
Last Updated : Jul 24, 2021, 7:37 PM IST