ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న కాలనీని సైతం వదలని ఇసుకాసురులు - ap latest news'

కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో.. కొందరు అక్రమార్కులు ఇసుక కోసం గోతులు తవ్వారు. దీంతో జగనన్న కాలనీల్లోని కొందరు లబ్ధిదారులు.. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన ఆయన.. స్థలాన్ని పరిశీలించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.

sand diggings in jagananna colony at kurnool
జగనన్న కాలనీని సైతం వదలని ఇసుకాసురులు

By

Published : Feb 11, 2022, 6:57 PM IST


కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో.. కొందరు అక్రమార్కులు ఇసుక కోసం గోతులు తవ్వారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో యథేచ్చగా ఇసుకను తవ్వుతున్నారు. దీంతో జగనన్న కాలనీ అంతా గుంతలమయంగా మారింది. నీటి పైపులైన్లు పగిలిపోయాయి. ఓ వైపు జగన్ సర్కార్.. పేదలకు సొంతింటి కలను నేరవేర్చే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు కొందరు అక్రమార్కులు ఇసుకను తవ్వుతున్నారు.

దీంతో జగనన్న కాలనీల్లోని కొందరు లబ్ధిదారులు.. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేయగా.. ఆయన ఆ స్థలాన్ని పరిశీలించారు. ఇసుకను అక్రమంగా తరలించిన వారిపై అరా తీసి.. కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details