కర్నూలు నగరంలో వరుసగా పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. బుధవారం నగరంలోని రోజా వీధిలోని మెకానిక్‌గా పని చేస్తున్న షరీఫ్ ఇంట్లో చోరీ జరిగింది. 10 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండి, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుడు ఇంటికి తాళం వేసుకొని పనికి వెళ్లగా… చోరీ జరిగిందని పోలీసులు వెల్లడించారు. కర్నూలు డీఎస్పీ మహేష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాల సేకరించారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు.
కర్నూలులో వరుస చోరీలు - కర్నూలు రోజా వీధి దొంగతనం
కర్నూలు నగరంలో పట్టగలే.. వరుస దొంగతనాలు జరగటం.. స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లపైనే దృష్టి సారించి.. దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.
చోరీ