ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనం, టిప్పర్​ ఢీ... దంపతులకు తీవ్ర గాయాలు ! - కర్నూలు ద్విచక్రవాహనం, టిప్పర్​ ఢీ...దంపతులకు తీవ్ర గాయాలు !

రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు కాగా... చిన్నారి స్వల్పగాయాలతో బయటపడిన ఘటన కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిపై జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ద్విచక్రవాహనం, టిప్పర్​ ఢీ...దంపతులకు తీవ్ర గాయాలు !
ద్విచక్రవాహనం, టిప్పర్​ ఢీ...దంపతులకు తీవ్ర గాయాలు !

By

Published : Jun 11, 2020, 11:50 AM IST

కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో దంపతులకు తీవ్రగాయాలు కాగా.. చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. డోన్ మండలం జగదూర్తి గ్రామానికి చెందిన కార్తీక్​కుమార్​రెడ్డి, కవిత దంపతులు తమ కుమారుడితో కలిసి ద్విచక్రవాహనపై బయల్దేరారు.

డోన్ సమీపంలోని భారత్ గ్యాస్ గోడౌన్ ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ వీరి బైక్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయాలపాలైన దంపతులను, చిన్నారిని స్థానికులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details