ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

accident: బస్సులో నుంచి తల బయట పెట్టింది.. ఊహించని దారుణం జరిగిపోయింది! - kurnool district crime news

చిన్నపాటి నిర్లక్ష్యం.. దారుణ విషాదానికి కారణమైంది! ఊహించని ఈ ఉపద్రవం.. నిండు ప్రాణాన్ని బలిగొంది! ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి కిటికీ లోంచి తల బయటకు పెట్టడంతో.. ఘోర ప్రమాదానికి గురైంది.

నల్లమల్ల ఘాట్ రోడ్డులో ప్రమాదం
నల్లమల్ల ఘాట్ రోడ్డులో ప్రమాదం

By

Published : Dec 2, 2021, 5:03 PM IST

శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్‌రోడ్డులో... విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి.. బయటకు చూసేందుకు కిటికీలోంచి తల బయటకు పెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో మలుపు వద్ద ఎదురుగా దూసుకొచ్చిన లారీ.. యువతి తలకు తగిలింది.

ఈ దుర్ఘటనలో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మహి(20)గా తెలుస్తోంది. గుంటూరు జిల్లా నరసారావుపేటలో డిగ్రీ చదువుతున్న సదరు యువతి.. శ్రీశైలం దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి:

ఉద్యోగ సంఘాలతో.. రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ

ABOUT THE AUTHOR

...view details