కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పత్తికొండకు చెందిన చాంద్ బాషా (32), జిలాన్(28)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చాంద్ బాషా తల తెగి రోడ్డుపై పడింది. ప్రమాద విషయం తెలియడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం.. తెగిపడిన ఒకరి తల! - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తికొండ మండలం హోసూరు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఒకరి తల తెగి రోడ్డుపై పడింది.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం