ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి నగలు కొనేందుకు వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - youngster died in road accident

జూన్​ 12న వివాహం..పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. నగలు కొనడానికి ఆదోనికి వెళ్లిన పెళ్లికొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యువకుడి మరణంతో పెళ్లింట విషాదం నెలకొంది.

youngster died in road accident at kurnool
పెళ్లి నగలు కొనేందుకు వెళ్లి

By

Published : May 26, 2021, 8:07 PM IST

కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్న ఘటనలో.. అక్కడిక్కడే పెళ్లి కుమారుడు వినోద్ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణమంతా విషాదంగా మారింది.

ఆలూరు తాలూకా మొలగవల్లి గ్రామానికి చెందిన వినోద్​కు జూన్ 12న వివాహం నిశ్చయమైంది. దీనికోసం అవసరమైన బంగారం కొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదోని పట్టణానికి వచ్చాడు. అనుకోకుండా ప్రమాదం రూపంలో అతడిని మృత్యువు కబళించింది. త్వరలో కొత్త జీవితం ప్రారంభించాల్సిన యువకుడు.. అకాలంగా మరణించడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details