ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డోన్​లో అక్రమ కట్టడాల తొలగింపు - కర్నూలు జిల్లా, డోన్ పట్టణం

కర్నూలు జిల్లాలో రహదారికి అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. రహదారి విస్తరణలో భాగంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఫణిరాజు ఇల్లు కూాడా తొలగించినట్లు అధికారులు తెలిపారు.

kurnool district
అక్రమ కట్టడాలను తొలగింపు

By

Published : Jun 10, 2020, 7:16 PM IST

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో 40 అడుగుల రహదారికి అడ్డుగా ఉండే ఇళ్లను కమిషనర్ కెఎల్ఎన్ రెడ్డి కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఫణిరాజుకు చెందిన ఇల్లు కూడా ఉంది. రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు నాలుగు నెలల కిందట నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా ఇళ్లు ఖాళీ చేయకపోవటంతో కూల్చివేశారు. ఫణి రాజు భార్య గాయత్రి దేవి గత ప్రభుత్వ హయాంలో డోన్ మున్సిపల్ చైర్ పర్సన్​గా పని చేశారు.

ABOUT THE AUTHOR

...view details