కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని శివన్న నగర్ కాలనీలో గుడిసెలను మున్సిపల్, రెవెన్యూ, పోలీసులు బలవంతంగా తొలగించటం ఉద్రిక్తంగా మారింది. గుడిసెలను పోలీసులుబలవంతంగా కూల్చారు. గుడిసెలు నేలమట్టం కావడంతో లబ్ధిదారులు రోదించారు. మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి హయాంలో 40 ఎకరాలకు పైగా భూమిలో 900 మందికి పైగా రెండు సెంట్ల స్థలం పంపిణీ చేశారు. కాలనీలో కనీస వసతులు లేక చాలామంది చేరలేదు.
ఎమ్మిగనూరులో గుడిసెల తొలగింపు..పరిస్థితి ఉద్రిక్తం - emiganuru news
ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని శివన్న నగర్ కాలనీలో గుడిసెలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పోలీసులు బలవంతంగా తొలగించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గుడిసెల తొలగింపు.. ఉధృతంగా మారిన పరిస్థతి
లబ్ధిదారుల్లో 50 మంది దాకా గుడిసెలు వేసుకోగా మరికొంతమంది గుడిసెలు వేసుకునేందుకు బండలు పాతుకున్నారు. ఖాళీ స్థలం ఉందని ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేశారు. గుడిసెలు తొలగించాలని అధికారులు చెప్పగా గతంలో తమకు పట్టాలు ఇచ్చారని లబ్ధిదారులు అడ్డుకున్నారు. అధికారులు ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి గుడిసెలను పొక్లెయిన్ తో తొలగించారు. అడ్డుకున్న లబ్ధిదారులను అరెస్ట్ చేశారు. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.