కర్నూలు-ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో డంప్ చేసిన 150 ఎర్ర చందనం దుంగలను మహానంది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో సంబంధం ఉన్న కడప జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు నాగూర్ బాషా, లక్ష్మి నారాయణలను అదుపులోకి తీసుకున్నారు.
Red Sandal: 150 ఎర్రచందనం దుంగలు పట్టివేత..ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు - ఎర్రచందనం దుంగలు పట్టివేత
150 ఎర్రచందనం దుంగలు పట్టివేత
16:31 September 09
మహానంది వద్ద 150 ఎర్రచందనం దుంగలు పట్టివేత
నిందితుల వద్ద నుంచి రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మరికొంత మందిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి
Last Updated : Sep 9, 2021, 8:05 PM IST