కర్నూలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్ను కలిసేందుకు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు యత్నించారు. వారిని నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాను న్యాయ రాజధానిగా ప్రకటించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. అదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని వివరించారు. సాయంత్రం వారిని స్టేషన్ నుంచి వదిలేశారు.
'న్యాయ రాజధానిగా ప్రకటించారు.. ప్రక్రియ మరిచారు'
నంద్యాలలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాను న్యాయ రాజధానిగా ప్రకటించి ప్రక్రియ ప్రారంభించకపోవడంపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు