ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుంగభద్ర కాల్వలో ముగ్గురు యువకులు గల్లంతు...ఇద్దరి మృతదేహాలు లభ్యం

ఈతకు దిగి ఇద్దరు రాజస్థాన్ యువకుల మృతి
ఈతకు దిగి ఇద్దరు రాజస్థాన్ యువకుల మృతి

By

Published : Oct 4, 2021, 10:18 PM IST

Updated : Oct 5, 2021, 5:39 PM IST

22:14 October 04

మృతులు రాజస్థాన్‌ వాసులు

సరదాగా ఈత కోసం తుంగభద్ర దిగువ కాల్వలోకి దిగి ముగ్గురు యువకులు గల్లంతు కాగా, వారిలో ఇద్దరు చనిపోయారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో జరిగిన ఈ ఘటనపై పెద్ద తుంబళం ఎస్సై చంద్ర కథనం ప్రకారం పెద్దతుంబళం గ్రామంలోని జైన మందిరంలో రాజస్థాన్​కు చెందిన సునీల్(18), భవాని(19), వినోద్(28) మరో ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. వారు సోమవారం సాయంత్రం సమీపంలో కాల్వ వద్దకు వెళ్లారు. ఈత సరిగా రాకపోయిన నీటిలోకి దిగినట్లు సమాచారం ముందుగా సునీల్ కాల్వలో కొట్టుకుపోతుండగా భవానీ కాపాడేందుకు యత్నించాడు. అతనూ కొట్టుకుపోతున్నట్లు గుర్తించిన వినోద్..నీళ్లలోకి దిగి రక్షించే క్రమంలో తానూ గల్లంతయ్యాడు. వీరితో పాటు వెళ్లిన మరో ఇద్దరు యువకులు ఆలయానికి వచ్చి తోటి సిబ్బందికి విషయం చెప్పారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని యువకుల ఆచూకీ కోసం గాలించారు. రాత్రి 9 గంటల తర్వాత భవానీ, సునీల్ మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. వినోద్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

ఇదీచదవండి.

వినాయక నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు... గ్రామస్థుల ఆగ్రహం

Last Updated : Oct 5, 2021, 5:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details