తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. రంగు రంగుల దీపాలతో మఠాన్ని సుందరంగా అలంకరించారు. విద్యుత్ కాంతులు, భక్తులతో స్వామి వారి మఠం కళకళలాడుతోంది. మఠం ఆచార సంప్రదాయాల ప్రకారం స్వామి వారికి పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కరాలు, కార్తీక సోమవారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
విద్యుత్ కాంతులు.. మెరిసిపోతున్న రాఘవేంద్ర స్వామి మఠం
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతుంది. తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో మఠాన్ని సుందరంగా అలంకరించారు.
విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న రాఘవేంద్ర స్వామి మఠం