పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్థంతిని.. కర్నూలులోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్రకమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్ పాల్గొని.. సుందరయ్య కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని కరోనా కష్ట సమయంలో కమ్యూనిస్టులుగా ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. కొవిడ్ రెండో దశ తీవ్రత దృష్ట్యా.. ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని గఫూర్ విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం పడకలు దొరకడం లేదన్నారు.
కర్నూలు సీపీఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి - పుచ్చలపల్లి సుందరయ్య
కర్నూలులోని సీపీఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్థంతిని నిర్వహించారు. ఆయన కాంస్య విగ్రహానికి.. ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.
పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్థంతి