ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత - news updates in kurnool district

కర్నూలు జిల్లా ఎర్రగుంట్లలో రహదారి ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు స్థానిక నేతలు పరిహారం అందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, గాయపడిన వారికి చికిత్స అందిస్తామని వారు తెలిపారు.

Provision of compensation to the families of road accident victims in kurnool district
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

By

Published : Dec 19, 2020, 4:52 PM IST

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామం వద్ద ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం... మృతుల కుటుంబానికి రూ.ఐదు లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది.

ఈ మేరకు శనివారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్ రామ్ సుందర్​రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు ఎర్రగుంట్లలో మృతుల కుటుంబాలకు పరిహారం అందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీచదవండి.

'విశాఖ ఘటనపై చంద్రబాబు ట్వీట్​ అవాస్తవం'

ABOUT THE AUTHOR

...view details