కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులు ధర్నా చేశారు. ఉల్లిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కొనుగోలుకు ప్రభుత్వం నిబంధనలు విధించటం వల్ల అమ్ముకునేందుకు ఇబ్బందిగా మారిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే నిబంధనలు సడలించి రైతుకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.