తమ సమస్యలను పరిష్కరించాలని కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా చేపట్టారు. నగర కార్పొరేషన్లో కలిసిన సమీప కాలనీలో కనీస వసతులు కల్పించకుండా పన్నులు పెంచారని వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు .36 వ వార్డులో పార్కులు కబ్జాకు గురవుతున్నాయని... మురుగు కాల్వలు లేక నీరు రోడ్లపైకి వస్తున్నాయని వాటిని వెంటనే నివృత్తి చేయాలని, శ్మశానానికి స్థలాలు ఏర్పాటు చేయాలని వారు కార్పొరేషన్ అధికారులను కోరారు. స్పందించిన అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పెరిగిన పన్నులతో విసిగిన కర్నూలు ప్రజలు
నగరపాలక సంస్థకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లావాసులు ఆందోళనలు చేపట్టారు. పెంచిన పన్నులను తగ్గించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ధర్నా చేశారు.
పెరిగిన పన్నులతో విసిగిన కర్నూలు ప్రజలు