భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని కర్నూలు జిల్లా నంద్యాల ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువజన విద్యార్థి సంఘం, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద 48 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. పట్టణంలోని బొమ్మలసత్రం వద్ద విగ్రహం ఉన్నప్పటికీ.. నంద్యాల ప్రధాన కూడలిలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోరుతూ నంద్యాలలో ఆందోళన - nandhyala latest news
కర్నూలు జిల్లా నంద్యాలలో యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. పట్టణ ప్రధాన కూడలిలో అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నంద్యాలలో ఆందోళన