ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెండింగ్​లో డీఈ కార్యాలయం విద్యుత్​ బిల్లు.. మీటర్ తీసుకెళ్లిన అధికారులు

కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలోని గృహనిర్మాణశాఖ డీఈ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. పెండింగ్​లో ఉన్న బిల్లులు చెల్లించ లేదని విద్యుత్తు శాఖ అధికారులు విద్యుత్తును నిలిపివేసి మీటరు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

డీఈ కార్యాలయం
డీఈ కార్యాలయం

By

Published : Oct 3, 2021, 3:16 PM IST

మంత్రాలయం డీఈ కార్యాలయానికి విద్యుత్తు నిలిపివేత

మంత్రాలయంలోని గృహనిర్మాణ శాఖ డీఈ కార్యాలయానికి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఎనిమిది నెలలకుగాను రూ.6 వేలకు పైగా బిల్లు పెండింగ్‌ ఉండటంతో విద్యుత్తు శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సరఫరాను నిలిపివేసి మీటరు తీసుకెళ్లారు.

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఏఈ ఎస్‌వీ ప్రసాద్‌ పేర్కొన్నారు. కార్యకలాపాలకు ఆటంకం లేకుండా డాటా ఎంట్రీకి ఎమ్మిగనూరులోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో ఏర్పాట్లుచేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:Mantralayam : మంత్రాలయాల రాఘవేంద్రుని సేవలో ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details